అతి పెద్ద విమానం.. అంతరిక్ష ప్రయాణం..!!

- April 22, 2018 , by Maagulf
అతి పెద్ద విమానం.. అంతరిక్ష ప్రయాణం..!!

కొలరాడో, అమెరికా : ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ‘స్ట్రాటో లాంచ్‌’ అతి త్వరలోనే తొలిసారి గగనయానం చేయనుంది. దాదాపు ఫుట్‌బాల్‌ మైదానమంత భారీ రెక్కలు కలిగిన ఈ విమానానికి రెండు కాక్‌పిట్స్‌, 28 చక్రాలు, ఆరు ఇంజన్లను అమర్చారు. సాధారణంగా ఆరు ఇంజన్లలతో 747 జంబో జెట్లను నడపొచ్చు.

భవిష్యత్‌లో ఈ విమానం ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి, అంతరిక్ష యానానికి వెళ్లే ప్రజలను భూమి నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్‌కు చేర్చడానికి ఉపయోగపడనుంది. మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు పాల్‌ అలెన్‌ కలలకు రూపం స్ట్రాటో లాంచ్‌.

కొలరాడోలో జరిగిన 34వ స్పేస్‌ సింపోజియంలో ఈ వేసవిలో విమానం తొలిసారి గగనతల విహారానికి వెళ్లనుందనే ప్రకటన వెలువడింది. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)కు స్ట్రోటో లాంచ్‌ కొన్ని రాకెట్లను మోసుకెళ్లనుంది కూడా. ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నాలజీల కన్నా అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోని స్ట్రాటో లాంచ్ ద్వారా ప్రయాణించొచ్చని పాల్‌ అలెన్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com