చైనా-భారత్ సంబంధాల్లో కొత్త శకం
- April 22, 2018
న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భారత ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఈ మేరకు చైనా పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. ఇరుదేశాల సంయుక్త ప్రకటనలో మాట్లాడిన సుష్మా.. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై జిన్పింగ్తో మోదీ ఈ నెల 27, 28న అనధికారికంగా వుహన్ నగరంలో సమావేశం అవుతారని చెప్పారు.
ఈ కీలక భేటీ ద్వారా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలికే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ భేటీ అనంతరం భారత్-చైనా సంబంధాల్లో గొప్ప ముందడుగు పడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిక్కింలోని నాథులా పాస్ గుండా మానస సరోవర యాత్రను తర్వలో పునఃప్రారంభించనున్నట్లు కూడా సుష్మా తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







