అమెరికాతో ఒప్పందాలా..?..ఉ.కొరియాకు ఇరాన్ హెచ్చరిక
- April 22, 2018
టెహ్రాన్: అమెరికాతో ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగు వేయాలని ఇరాన్ ఉ.కొరియాకు సూచించింది. తమ దేశంతో ఆరు దేశాల కూటమి కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని పున్ణసమీక్షిస్తామనంటం ద్వారా అమెరికాలోని ట్రంప్ సర్కారు తనతో చర్చలకు సిద్ధపడే దేశాలకు ప్రమాదకర సందేశాలను పంపుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్ హెచ్చరించారు. న్యూయార్క్‌లో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అమెరికా తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయటంలో విఫలమవటం మాత్రమే కాక దానిని మరింత విస్తరించాలంటోందని విమర్శించారు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాక ప్రపంచ దేశాలకు కూడా ప్రమాదకర సందేశమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







