మహేష్ చేయి పడ్డాక అమ్మడి జాతకం మారింది..!

- April 22, 2018 , by Maagulf
మహేష్ చేయి పడ్డాక అమ్మడి జాతకం మారింది..!

మహేష్ సరసన నటిస్తే చాలు ఇక ఆ అమ్మడి దశ తిరిగినట్టే.. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది కైరా అద్వాని. బాలీవుడ్ లో ఎమ్మెస్ ధోని బయోపిక్ లో కనిపించిన ఈ అమ్మడు ఏకంగా మహేష్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఇక రీసెంట్ గా వచ్చిన సినిమా సూపర్ హిట్ కొట్టడంతో అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఆమె నటిస్తుందని తెలియగా ఇప్పుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కించే RRR ప్రాజెక్ట్ లో కూడా అమ్మడు ప్లేస్ అయ్యిందని అంటున్నారు.

బాహుబలి తర్వాత ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. రాం చరణ్ హార్స్ రైడర్ గా.. ఎన్.టి.ఆర్ బాక్సర్ గా కనిపిస్తారని.. ఒలంపిక్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని చెబుతున్నారు. అక్టోబర్ నుండి మొదలయ్యే ఈ సినిమా టాలీవుడ్ లో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

బాలీవుడ్ నుండి వచ్చిన కైరా మొదటి సినిమా హిట్ అవడంతో ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నారు. మరి చూస్తుంటే అమ్మడు తెలుగులో టాప్ రేంజ్ కు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. మహేష్ చేయి పడ్డాక అమ్మడి జాతకం మారకపోతే ఎలా చెప్పండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com