బాలీవుడ్ మెగాస్టార్ కూతురి డ్యాన్స్ వైరల్..

బాలీవుడ్ మెగాస్టార్ కూతురి డ్యాన్స్ వైరల్..

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్స్‌ అబూ జానీ, సందీప్‌ ఖోస్లా బంధువు సౌదామిని వివాహ రిసెప్షన్ బాలీవుడ్‌ స్టార్స్‌  మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు అతిరధ మహారధులు వచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కుటుంబం, కూతురు శ్వేతా బచ్చన్ నంద కూడా హాజరయ్యారు.  అయితే అందరి చూపులను తనవైపు తిప్పుకున్నారు  శ్వేతా బచ్చన్. దీనికి కారణం లేకపోలేదు. పెళ్లి వేడుకలో శ్వేతా చేసిన డ్యాన్స్ ఇందుకు కారణం. ఆమె చేసిన నృత్యానికి పలువురు బాలీవుడ్ నటులు ఫిదా అయ్యారు. పెళ్లి రిసెప్షన్ వేడుకలో తల్లి జయాబచ్చన్‌తో కలిసి శ్వేతా వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలవొకగా ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు బాలీవుడ్ ప్రముకులను ఆకర్షిస్తోంది. 

Back to Top