రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- July 27, 2024
కువైట్: క్షమాభిక్ష పథకాన్ని వినియోగించుకోవడంలో విఫలమైన, రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్ గవర్నరేట్‌లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెసిడెన్స్ చట్టాన్ని ఉల్లంఘించిన పలువురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దేశం నుండి వారిని బహిష్కరించడం కోసం వారిని సమర్థ అధికారికి సిఫార్సు చేసినట్టు పేర్కొన్నారు.
రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించేవారిని అరెస్టు చేయడానికి దేశవ్యాప్తంగా భద్రతా ప్రచారాలు కొనసాగుతున్నాయని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా విభాగం వెల్లడించింది. ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ (112)కి కాల్ చేయడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించేవారి వివరాలను నివేదించి, భద్రతా సిబ్బందికి సహకరించాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







