ఒలంపిక్ టార్చ్‌తో మెగాస్టార్ చిరంజీవి..

- July 27, 2024 , by Maagulf
ఒలంపిక్ టార్చ్‌తో మెగాస్టార్ చిరంజీవి..

పారిస్: మన మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా వెకేషన్ కి లండన్ వెళ్లి అటునుంచి పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లినట్టు యివాళ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక పారిస్ వీధుల్లో ఈ మెగా కపుల్స్ చేస్తున్న సందడిని వీడియోలు తీసి ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా మెగాస్టార్ ఒలంపిక్ టార్చ్ తో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

సాధారణంగా ఒలంపిక్ టార్చ్ ని స్టార్ ఆటగాళ్లు, దేశ ప్రతినిధులు, అధికారులు, స్టార్ సెలబ్రిటీలు పట్టుకుంటారు. అయితే మెగాస్టార్ కూడా పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లడంతో అక్కడ ఇండియన్స్ ద్వారా ఆ ఒలంపిక్ టార్చ్ మన మెగాస్టార్ చేతికి కూడా వచ్చింది. దీంతో చిరంజీవి ఒలంపిక్ టార్చ్ పట్టుకొని తన భార్య సురేఖతో కలిసి పారిస్ విధుల్లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

చిరంజీవి ఒలంపిక్ టార్చ్ తో ఫోటో షేర్ చేసి.. ఒలంపిక్స్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉంది. ఒలంపిక్ టార్చ్ ని పట్టుకొవడం మర్చిపోలేని అనుభూతి. మన ఇండియా నుంచి ఆడే వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. దీంతో చిరంజీవి ఫోటో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసి ఒలంపిక్ టార్చ్ ని చిరంజీవి పట్టుకున్నాడంటే మాములు విషయం కాదు. పారిస్ లో కూడా మెగాస్టార్ రేంజ్ మాములుగా లేదుగా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com