దుమారం లేపుతున్న మోడీ వ్యాఖ్యలు..
- April 22, 2018
కామన్ వెల్త్ దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు గతవారం లండన్‌లో పర్యటించిన ప్రధాని మోడీ వైద్యుల గురించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్లర్టు, ఫార్మా కంపెనీల మధ్య అక్రమ అవగాహన వల్లే.. వైద్యులు ఖరీదైన మందులను సిఫారసు చేస్తున్నట్టు ప్రధాని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలపై ఆర్ధికభారం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
అయితే మోడీ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలు భారతీయ వైద్యులను అప్రతిష్ఠపాలు చేసేవిధంగా ఉన్నాయని ఆక్షేపించింది. ఈ మేరకు ఐఎంఏ ప్రధానమంత్రికి లేఖరాసింది. వైద్యులు గనుక లేకపోతే దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని.. ప్రస్తుత పరిస్థితులతోపాటు ప్రభుత్వాల విధానాల వల్ల వైద్య వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నది. విదేశాల్లో భారతీయ వైద్యులపై బురదజల్లే విధంగా మాట్లాడటం సరికాదని తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







