విమానంలో దోమల్ని చంపిన ట్వింకిల్ ఖన్నా
April 22, 2018
బాలీవుడ్ నటి, నిర్మాత ట్వింకిల్ ఖన్నా తాజాగా ఎయిర్‌లైన్స్‌పై ట్వీట్ చేసింది. ఇటీవల ఆమె విమానంలో ప్రయాణిస్తూ సీటు బెల్టు పెట్టుకుంటుండగా దోమలు కనిపించడంతో ఏడు దోమలను చంపారట. దీనిపై ట్వీట్ చేస్తూ 'ఫ్లయిట్ సీటు కింద లైఫ్ జాకెట్ ఉంచేందుకు బదులు ఓడోమస్ ట్యూబ్ పెట్టుకోండి. నేను ఇప్పుడే దోమలను చంపాను. వేరే ప్రమాదానికి బదులు డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయే ముప్పు పొంచివుంది' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుండి భిన్న స్పందనలు ఎదురయ్యాయి.