మే 17న రమదాన్‌: కువైటీ ఆస్ట్రనామర్‌ అంచనా

- April 22, 2018 , by Maagulf
మే 17న రమదాన్‌: కువైటీ ఆస్ట్రనామర్‌ అంచనా

పవిత్ర రమదాన్‌ మే 17న రావొచ్చునని కువైటీ ఆస్ట్రనామర్‌ అంచనా వేశారు. కువైట్‌లో క్రిసెంట్‌ మూన్‌ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లేదు. ఇది కేవలం టెలిస్కోప్‌ ద్వారా మాత్రమే కనిపిస్తుంది. వెస్ట్రన్‌ అరబ్‌ వరల్డ్‌ మాత్రం క్రిసెంట్‌ మూన్‌ని తిలకించే అవకాశం వుందని ఆస్ట్రనామర్‌ అదెల్‌ అల్‌ సాదౌన్‌ చెప్పారు. పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. ఈ ఉపవాస దీక్షలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయని పలువురు వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం ఉపవాస దీక్షల పట్ల అప్రమత్తంగా వుండాలి. వైద్యుల సూచన మేరకు వారు ఉపవాస దీక్షలు చేయాల్సి వుంటుంది. వేసవి కావడంతో, సుమారు 15 గంటల పాటు ఉపవాస దీక్షలు కొంత కష్టతరమే. అయినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో చేసే ఉపవాస దీక్షలతో తమకు మేలు జరుగుతుందని ముస్లింలు భావిస్తుంటారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com