ఈశ్వరరెడ్డి దర్శకత్వం లో 'అల్లరి' నరేశ్ హీరోగా ..
- December 04, 2015
గతంలో 'గజదొంగ', 'అడవిదొంగ', 'దొంగరాముడు', 'చిన్నఅల్లుడు' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గోపీ ఆర్ట్స్ సంస్థ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ చిత్రనిర్మాణకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యువకథానాయకుడు 'అల్లరి' నరేశ్ హీరోగా ఓ వినోదభరిత చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్లో మొదలయ్యాయని చిత్రనిర్మాత, గోపీ ఆర్ట్స్ అధినేత చలసాని రామబ్రహ్మంచౌదరి చెప్పారు. ఇంతకుముందు 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం' చిత్రానికి దర్శకత్వం వహించిన ఈశ్వరరెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. ఏ.కె.ఎంటర్టైనమెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ చిత్రానికి సమర్పకుడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







