ఆరోగ్యానికి మేలు చేసే జీలకర్ర...
- December 04, 2015
మనం వంటకాలలో జీలకర్రకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. పోపు పెట్టడం నుంచి పలు రకాల వంటకాలకు, కూరలకు జీరా ఫ్లేవర్ తగిలితేనే అసలైన రుచి, సువాసన. జీలకర్ర పొడిని కూరల్లో వాడితే అమోఘమైన రుచివస్తుంది. జీలకర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ రారాజు. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. రక్తంలో హీమోగ్లోబిన్ తయారవటానికి కావలసిన ముఖ్యమైన పోషకమైన ఐరన్ జీలకర్రలో పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా తగ్గించుకోవడానికి జీరా బాగా సహాయపడుతుంది. రక్తహీనత ఎక్కువగా పిల్లలు, ఆడవాళ్లలో కనిపిస్తుంది. కాబట్టి జీలకర్రను రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పైల్స్ ఉన్నవాళ్లకు జీలకర్ర చక్కటి పరిష్కారం. జీలకర్రలో ఎక్కువగా ఫైబర్, యాంటీ ఫంగల్, లాక్సైటీవ్స్, కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. ఇది మొలల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. జీలకర్ర కడుపు నొప్పి, విరేచనాలు, మార్నింగ్ సిక్ నెస్ నుంచి కాపాడుతుంది. నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకు జీలకర్ర చక్కగా పనిచేస్తుంది. క్రమరహిత రుతుక్రమాలతో బాధపడేవాళ్లు రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల నెలసరి క్రమంగా రావడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పెంచడంలో జీలకర్ర బాగా సహకరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరిన మలినాలను తొలగించి, ప్రీ రాడికల్స్ నివారించి వ్యాధులను తట్టుకునేలా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీలకర్ర విటమిన్ E ని ఎక్కువగా కలిగి ఉండటం వల్ల, యాంటీ ఏజింగ్ గా పనిచేసి చర్మం పై ముడతలు రాకుండా చేస్తుంది. కాబట్టి జీలకర్రను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజువారీ డైట్ లో జీలకర్రను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. దీనివల్ల మధుమేహం తగ్గడానికి సహాయపడతాయి. వంటల్లో జీరా పౌడర్ వాడటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ లను తగ్గింవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో జీరాను చేర్చుకోవడం మంచిది. జీలకర్ర తైమోక్వినోన్ ని కలిగి ఉండటం వల్ల అస్తమాని అరికడతాయి. జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారకాలను కలిగి ఉండటం వల్ల జలుబు, ఫ్లూలను కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర విత్తనాలు, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకుని తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. జీలకర్ర ఆరోగ్యానికే కాదు.. కేశ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. జీలకర్రని వాడటం వల్ల బట్టతలని నివారించడమే కాదు జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర ఆయిల్, ఆలివ్ ఆయిల్ ని సమానంగా తీసుకుని తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుతుంది.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







