ఎన్నికల ప్రచారంలో ప్రముఖులు

ఎన్నికల ప్రచారంలో ప్రముఖులు

కర్నాటక శాసనసభ ఎన్నికల నామినేషన్ల సమర్పణకు ఇక ఒక రోజే గడువు ఉండటంతో ఇప్పుడు అన్నీ పార్టీల దృష్టి ప్రచారంపై పడింది. కాంగ్రెస్‌, బీజేపీలు దేశంలోని ప్రముఖులను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే అతిరథుల ప్రచారానికి ప్రాంతాలు, తేదీలు ఖరారయ్యాయి. ప్రధాని మోదీ ఈ నెల 29 నుంచి 16 చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. హేమామాలిని, యూపీ సీఎం యోగి కూడా బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ, మన్మోహన్‌, చిరంజీవి, ఖుష్బు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కన్నడ నటి రమ్య ప్రచారానికి సిద్ధమయ్యారు. 

Back to Top