ఉత్తర కొరియా బస్సు ప్రమాదంలో 30 మంది మృతి

ఉత్తర కొరియా బస్సు ప్రమాదంలో 30 మంది మృతి

ప్యాంగ్ యాంగ్: ఉత్తర కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హువాన్‌ఘై హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో 30 మంది మృతిచెందారు. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాతావరణం సరిగా లేని కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనీస్ ట్రావెల్ కంపెనీ సభ్యులు ఆ బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ కొరియాలో ఉన్న చైనీస్ ఎంబసీ ఈ విషయాన్ని దృవీకరించింది. సాధారణంగా నార్త్ కొరియాకు చైనా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. సుమారు 80 శాతం మంది విదేశీ టూరిస్టుల్లో చైనీయులే ఉంటారు.

Back to Top