బంధుత్వాలను గుర్తు చేస్తున్న'అమ్మమ్మగారిల్లు' టీజర్

బంధుత్వాలను గుర్తు చేస్తున్న'అమ్మమ్మగారిల్లు' టీజర్

నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. ఆదివారం విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కజిన్స్‌ ఇంటికి, ఫ్రెండ్స్‌ ఇంటికి వెళ్లినా ఎక్కువ సేపు ఉండలేం నాన్న..తిరిగి వచ్చేయాలి అనిపిస్తుంది.. కానీ ఒక్క అమ్మమ్మ ఇంటికి వెళ్తే మాత్రం తిరిగి రావాలి అనిపించదు' అంటూ ఈ టీజర్‌ ప్రారంభమైంది. పల్లెటూరులో పెద్ద కుటుంబం, వారి మధ్య ఆప్యాయతల్ని ఇందులో చూపించారు. అమ్మమ్మకు నచ్చితే ఏమైనా చేస్తాను రా దాంట్లో వచ్చే ఆనందమే వేరు' అనే నాగశౌర్య డైలాగ్‌తో టీజర్‌ ముగిసింది. షామిలీ కథానాయిక. సుందర్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.

Back to Top