ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా, నందమూరి వారసులు..!!
- April 24, 2018
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా మలుస్తున్నారు బాలకృష్ణ. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బసవతారకంగా విద్యాబాలన్ ఖరారయ్యారని ఇండస్ట్రీ టాక్. మరి చిన్ననాటి ఎన్టీఆర్ గా ఎవరు నటించనున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన కుటుంబసభ్యులు దగ్గరుండి డిజైన్ చేస్తున్నారు. తమ కుటుంబ గౌరవం పెంచేలా ఉండే ఈ సినిమాలో వివిథ పాత్రలకు కుటుంబ సభ్యులనే ఎంపిక చేయాలని దర్శక, నిర్మాతలు, బాలకృష్ణ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న పేర్లు ఆసక్తి రేపుతున్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా నారా వారసుడు కూడా తెరంగేట్రం చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయ వర్గాల్లో కూడా తెగ చక్కర్లు కొడుతోంది. బుడిబుడి అడుగులు వేసే ఎన్డీయార్ పాత్రలో నారా దేవాన్ష్ చేయనున్నారట. చంద్రబాబు- బాలకృష్ణల మద్దుల మనవడు.. బ్రాహ్మణి-లోకేష్ తనయుడు ఈ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఇక స్కూలు వయసు పాత్రలో కూడా మరో నందమూరి వారసుడు చేయనున్నట్టు తెలుస్తోంది. హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ తనయుడు శౌర్యరామ్ కూడా కనిపించనున్నారట. మొత్తానికి ఎన్డీయార్ పాత్రలో అద్యంతం ఆయన వారసులే నటించే ఛాన్స్ ఉంది. యుక్త వయసులో ఎన్టీఆర్ పాత్రకు మోక్షజ్ఞ పేరు ప్రస్తావించినా.. బాలయ్య ఒప్పుకోలేదట. సోలో హీరోగానే మోక్షజ్ఞను పరిచయం చేయడానికి బాలకృష్ణ ఇష్టపడుతున్నారు. చిన్న పాత్ర రూపంలో తీసుకరావడం ఆయనకు ఇష్టం లేదట. అయితే ఈ పాత్రలో ఎవరు ఉంటారన్నది చూడాలి.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన తనయకుడు హరికృష్ణ పాత్ర కూడా ఎవరు పోషిస్తారన్నది ఆసక్తిగా మారింది. కళ్యాణ్ రామ్ ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చినప్పుడు.. చైతన్య రథం డ్రైవర్ గానే కాదు.. తండ్రికి అన్నీ తానై తోడునీడగా ఉన్నారు. అలాంటి కీలక పాత్రలో ఆయన తనయుడు కళ్యాణ్ సరైన ఎంపిక అంటున్నాయి సినీ వర్గాలు. ఆలా మొత్తానికి అవకాశం ఉన్న ప్రతిచోటా నందమూరి వారసులను జొప్పించడానికి దర్శకుడు తేజ ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు