హత్య కేసులో దోషికి జీవిత ఖైదు

- April 24, 2018 , by Maagulf
హత్య కేసులో దోషికి జీవిత ఖైదు

ఓ హత్య కేసులో నిందితుడు దేశం వదిలి పారిపోయి, తిరిగి 14 ఏళ్ళ తర్వాత యూఏఈకి రాగా, అతనికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. ఈ హత్యలో అతనికి సహకరించిన మరో ఇద్దరికి సైతం జీవిత ఖైదును న్యాయస్థానం విధించింది. దుబాయ్‌ క్రిమినల్‌ కోర్టు ఈ శిక్షల్ని ఖరారు చేసింది. 2003లో ముగ్గరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేశారు. మృతుడు క్యాషియర్‌. అతనిపై దాడి చేసి 3,000 దిర్హామ్‌ల నగదు, ఏటీఎం కార్డు దొంగిలించారు దుండగులు. పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్‌ చేయగా, మూడో వ్యక్తి దేశం విడిచి పారిపోయాడు. 14 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చిన అతనికి జీవిత ఖైదుతో యూఏఈ స్వాగతం పలికినట్లయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com