భారతీయ వాయుసేనలోకి పురాతన విమానం

- April 24, 2018 , by Maagulf
భారతీయ వాయుసేనలోకి పురాతన విమానం

భారతీయ వాయుసేనలోకి పురాతన డగ్లస్‌ డీసీ 3 విమానం వచ్చి చేరనుంది. పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన ఈ విమానాన్ని రాజ్యసభ ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖరన్‌ ఐఏఎఫ్‌కు బహుమతిగా ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో, 1947 ఇండో-పాకిస్తాన్‌ యుద్ధాల్లో దీన్ని వినియోగించారు. ఈ సమయంలో డకోటా అని ముద్దుగా పిలుచుకునే ఈ విమానానికి చంద్రశేఖరన్‌ తండ్రి పైలట్‌గా వ్యవహరించారు. మరికొద్ది నెలల్లో యూకే నుంచి విమానం భారత్‌కు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com