ఉరిశిక్ష రద్దుపై పిటిషన్.. కీలక పరిణామాలు
- April 24, 2018
న్యూఢిల్లీ : ఉరి శిక్షకు ప్రత్యామ్నాయంపై సుప్రీం కోర్టులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నేడు కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఉరి శిక్ష రద్దును చేసి.. ఇతర మార్గాల ద్వారా మరణ శిక్షను అమలుపరచాలని, ఈ మేరకు చట్టంలో సవరణ చేయాలని అడ్వొకేట్ రోషి మల్హోత్రా.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఉరి ముమ్మాటికీ వ్యక్తి స్వేచ్ఛా హక్కులను అగౌరవపరిచినట్లేనని ఆయన వాదనలు వినిపించారు.
దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించించి. దీనికి స్పందించిన కేంద్రం మంగళవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపటం, తుపాకులతో కాల్చి చంపటం కన్నా ఉరి శిక్ష చాలా సులువైన పద్ధతని.. సురక్షితంగా, త్వరగతిన అమలు చేసేందుకు వీలవుతుందని కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. దీనిని పరిశీలనకు స్వీకరించిన తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







