రజనీ చిత్రంలో 'విజయ్ సేతుపతి'

- April 26, 2018 , by Maagulf
రజనీ చిత్రంలో 'విజయ్ సేతుపతి'

రజనీకాంత్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్ర నిర్మాణసంస్థ సన్‌పిక్చర్స్‌ స్వయంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆయన ప్రతినాయక పాత్రలో కన్పిస్తారని తెలుస్తోంది. కార్తీక్‌ సుబ్బరాజు తొలి చిత్రం 'పిజ్జా'లో విజయ్‌ సేతుపతి కథానాయకుడు. విజయ్‌ సేతుపతి ప్రస్తుతం మణిరత్నం చిత్రంతో పాటు 'సైరా'లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com