జూలైలో ప్రభాస్ మరో సినిమా

- April 26, 2018 , by Maagulf
జూలైలో ప్రభాస్ మరో సినిమా

నటుడు ప్రభాస్ మరో కొత్త సినిమా చేయబోతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో ప్రభాస్ చేయబోయే సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్ళనుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడ రూపొందనున్న ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా, అభిమానులందరిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని రాధాకృష్ణ చెప్పాడు. పూజా హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు స్వయంగా నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com