అమరావతి సచివాలయ నిర్మాణానికి టెండర్లు
- April 27, 2018
అమరావతి రాజధాని నిర్మాణంలో సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో టవర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. 5 టవర్లలో 69 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో సచివాలయం నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,176 కోట్లతో మూడు ప్యాకేజీలుగా టెండర్లు ఏర్పాటు చేశారు.
జీఏడీ టవర్ (50 అంతస్థులు) నిర్మాణం వ్యయం 530 కోట్లు కాగా, 40 అంతస్థుల చొప్పున మిగిలిన నాలుగు టవర్లు నిర్మించనున్నారు. 1, 2 టవర్ల నిర్మాణ వ్యయం- 895 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణ వ్యయం- 751 కోట్లుగా నిర్ణయించారు. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 16 వరకు గడువు విధించారు. ప్రముఖ కంపెనీలు ఇంట్రెస్టుతో ఉన్నట్టు సమాచారం.
కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాకా ఇకపై పై నుండి ఎలాంటి సాయం ఉండదు అనే నిర్ధారణకు వచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే డబ్బులకు కటకటలాడుతున్నా ముందుకు పోవడమే అని నిర్ణయించుకుని ముందడుగు వేశారు. ఇప్పటికే నిధుల సమీకరణకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







