క్లియరెన్స్‌లో ఆలస్యంతో ఉలెన్ మార్కెట్‌పై ప్రభావం
- December 05, 2015
పాత స్టాక్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో మార్కెట్లలోకి కొత్తగా ఉలెన్ సరుకు రావడం ఇబ్బందికరంగా మారింది. వ్యాపారులు కొత్త స్టాక్‌పై ఇంకా ఆసక్తి చూపడంలేదు. అలాగే మార్కెట్లోకి కొత్త స్టాక్ రావడం కూడా ఆలస్యమవుతోంది. ప్రతి ఏడాది 10 నుంచి 15 శాతం వరకూ కొత్త ఉలెన్ ఉత్పత్తుల ధర పెరుగుతుంటుంది. అయితే ఈసారి ఆ పెరుగుదల 30 నుంచి 40 శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివిధ రకాల ఖర్చులు పెరగడంతో ఆ ప్రభావం ఉలెన్ మార్కెట్‌పై పడిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఒక కార్టన్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చు గత ఏడాదితో పోల్చితే బాగా పెరిగింది. ఈ పెరుగుదల 30 ఖతారీ రియాల్స్ నుంచి 50 ఖతారీ రియాల్స్ వరకూ పెరిగింది. చైనా నుంచి వచ్చే తక్కువ ఖరీదు గల ఉలెన్ వస్తువులు మార్కెట్ నుంచి ఇంకా క్లియర్ కాలేదు. ఈ ప్రభావమే ఉలెన్ మార్కెట్‌పై ఎక్కువగా పడవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







