ఒమన్ ఎయిర్‌పోర్ట్ ట్యాక్సీ కాస్ట్‌లీ గురూ!
- December 05, 2015
గల్ఫ్ దేశాల్లోనే అత్యధికంగా ట్యాక్సీ ఫేర్స్ ఒమన్‌లో ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఒమన్ రాజధాని మస్కట్‌లో ఎయిర్‌పోర్ట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులకు అతి ఖరీదైన ప్రయాణం తప్పడంలేదు. ట్యాక్సీ డ్రైవర్స్ లగ్జరీ పేరు చెప్పి ప్రయాణీకుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు కొందరు ట్యాక్సీ డ్రైవర్లే ఆరోపిస్తున్నారు. అయితే అధికంగా ట్యాక్సీ ఫేర్ వసూలు చేస్తున్నవారు మాత్రం, 2016 మోడల్ సూపర్ లగ్జరీ లెక్సస్ కార్లను వినియోగిస్తున్నామనీ, ప్రయాణీకుల కోసం ఈ స్థాయి లగ్జరీ ఏర్పాటు చేస్తున్నందున, ఫేర్స్‌లో ఆ మాత్రం ఖరీదు తప్పనిసరన్నది వారి వాదన. ఎయిర్ పోర్ట్ నుంచి మాబెలా వరకు 46 ఒమనీ రియాల్ వసూలు చేస్తుండగా, అజైబాకి 40 ఒమనీ రియాల్ వసూలు చేస్తున్నారు. 2015లో లగ్జరీ ట్యాక్స్ ఫేర్ లెక్కలు తీస్తే, జ్యురిచ్ 27.59 డాలర్లుగా ఉంది. లగ్జెంబర్గ్ 22.34 డాలర్లతోనూ, జెనీవా 20.58 డాలర్లతోనూ, ఆక్లాండ్ 19.72 డాలర్లతోనూ, స్టాక్‌హోమ్ 18.56 డాలర్తఓనూ తర్వాతి వరుసలో ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో మాత్రం ఒమన్‌దే టాప్.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







