గౌహతిలో జంట పేలుళ్లు
- December 05, 2015
గౌహతిలో జంట పేలుళ్లు సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక ఫ్యాన్సీ బజార్ లో శనివారం మధ్యాహ్నాం ఈ ఘటన చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుళ్ల తీవ్రత తక్కువగా ఉందని, ఎలాంటి భయం అక్కర్లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇది తీవ్రవాదుల చర్యా ? లేక ఇతరులెవరైనా చేశారా ? అనేది తెలియరాలేదు. ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు.. దేశ రాజధానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడవచ్చని ఎఫ్ఐఆర్ నమోదైంది. 1వ తేదీన ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలో చొరబడ్డారని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. దీనిపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. పారిస్ ఘటన తరువాత ఉగ్రవాద కార్యాకలాపాలు విస్తరించే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ భావించింది. దేశంలో ఎవరైనా ఎంటర్ అయ్యారా ? అని ఇంటిలిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనితో దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులు దాటి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







