కుళ్ళుబోతు నక్క..

- May 07, 2015 , by Maagulf
కుళ్ళుబోతు నక్క..

అనగనగా ఓ ఊరుండేది. అక్కడ చలికాలంలో బాగా మంచు కురిసేది. చెరువుల్లో, నదుల్లో నీళ్ళు కూడా పైపైన పొరలా గడ్డ కట్టుకుపోయేవి. చేపలేమో ఆ పొర అడుగున ఉండేవి. ఆ ఊళ్ళో ఓ పెద్ద ఎలుగుబంటీ, ఓ నక్క కూడా ఉండేవి. ఎలుగు బంటికి అప్పట్లో పొడవైన అందమైన తోక ఉండేది. దాన్ని అందరూ చూడాలని అటూ ఇటూ ఊపుతూ వయ్యారంగా నడిచేది. నక్క అప్పుడు కూడా కుళ్ళుబోతుదే! అందుకే ఎలుగు బంటిని ఏదో రకంగా ఏడిపించలనుకుంది. ఓ రోజు ఎలుగు బంటి వచ్చే దారిలో మంచు మధ్యలో నీళ్ళు ఉండే చోట చిన్న గుంట తవ్వి అందులో తోక పెట్టి కూర్చుంది.అప్పుడు ఎలుగేమో 'నక్క బావా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు' అంది. 'నేను నా తోకతో చేపలు పడుతున్నాను' అన్నది నక్క. 'ఇలా పెడితే చేపలు వచ్చి న తోకను పట్టుకుంటాయి. అప్పుడు నా తోకను బయటకి లాగుతాను. అంతే' అంది. 'కావాలంటే నువ్వూ ప్రయత్నించు' అంది. ఎలుగు తోక పెట్టబోతుంటే ఇక్కడ చేపలన్నీ అయిపోయాయి. నేనింకో చోటు చూపిస్తారా అంటూ చాలా లోతుతో చేపలుండే స్థలానికి తీసుకెళ్ళింది. ఓ చిన్న రంధ్రం చేసి నీ తోకను ఇందులో పెట్టి కూర్చో అస్సలు కదలకు, కదిలితే చేపలు దగ్గరకు రావు అని చెబుతుంది. ఎలుగు అలాగే చేస్తుంది. 'నేను పిలిచేవరకూ ఇలాగే కూర్చో' అని చెప్పి నక్క ఇంటికి వెళ్లి నిద్రపోతుంది. తెల్లవారాక ఎలుగుబంటి ఉందా లేదా అని చూసేందుకు వెళ్ళింది. మంచులో కప్పబడిపోయి గుర్రుపెట్టి నిద్రపోతోంది ఎలుగు. అప్పుడు దాన్ని నిద్ర లేపి 'తోకతీయి' అని చెప్పింది నక్క. ఎలుగు తోకను తీసుకోబోతే అది రాలేదు. 'చాలా చేపలు పట్టుకొని ఉంటాయి, గట్టిగా లాగు' అని చెప్పింది నక్క. అంతే ఎలుగు చాలా వేగంగా,బలంగా తోకను లాక్కుంది. చేపలు రాలేదు సరికదా తోక తెగిపోయింది. దాన్ని చూసి 'తెలివి తక్కువ బావా , తోకతో ఎవరైనా చేపలు పడతారా' అని వెక్కిరిస్తూ పడీపడీ నవ్వసాగింది నక్క. అప్పటినుంచి ఎలుగు బంటికి చాలా చిన్న తోక ఉంటుంది. ఇంక చలికాలమంటే భయమేసి ఆ సమయమంతా నిద్రలోనే ఉంటుంది. నక్కంటే చాలా కోపం కూడా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com