హీరో 'నానీ'కి బంపర్ ఆఫర్
- May 01, 2018
తక్కువ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ సూపర్ హిట్ లను కైవసం చేసుకున్నారు నాచురల్ స్టార్ నాని.. కెరీర్ పీక్ దశలో ఉండగానే మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు నాని. అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మహానటి' సినిమాలో నాని ఎన్టీఆర్ గా కనిపించనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై ఫైనల్ దశకు వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో ఇప్పటికే నాగచైతన్య నటిస్తుండగా.. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారని అందరూ ఊహించారు కానీ అనూహ్యంగా నాని పేరు తెరపైకి వచ్చింది. కీలక పాత్ర అయిన సావిత్రి పాత్రను నటి కీర్తి సురేష్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల కిందట రిలీజ్ అయినా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా మే 1 వ తేదీన మహానటి ఆడియో వేడుక జరగనుంది. ఈ వేడుకకు అతిరధ మహారథుల తోపాటు టాలీవుడ్ కీలక నటీనటులు హాజరవనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు