జ్యోతికతో నటించే ఛాన్స్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

- May 01, 2018 , by Maagulf
జ్యోతికతో నటించే ఛాన్స్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

తమిళ చిత్రం 'నాచ్చియార్‌' తరువాత జ్యోతిక నటించబోతున్న చిత్రం 'కాట్రిన్‌ మొళి'. సామాజిక స్పృహతో సినిమాలు తీస్తారన్న పేరు సంపాదించిన సీనియర్‌ దర్శకుడు రాధామోహన్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతోంది. హిందీలో విద్యాబాలన్‌ ప్రధానపాత్రలో ఘన విజయం సాధించిన 'తుమ్హారీసులు' చిత్రానికి రీమేక్‌ ఇది. కథ ప్రకారం జ్యోతికకు కవలలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. ఆ పాత్రల్లో నిజమైన కవలలనే నటింపజేయాలని రాధామోహన్‌ నిర్ణయించారు. హిందీలోనూ ప్రత్యేకంగా అన్వేషించి కవల సోదరీ మణులను పట్టుకున్నారు. ఇప్పుడు తమిళ వెర్షన్‌ కోసం 35 నుండి 45 ఏళ్లలోపు ఉన్న కవల సోదరీమణులను వెతుకుతున్నారు. సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కలిగిన కవలు 98408 41150 వాట్సాప్‌ నెంబరు ద్వారా తమను సంప్రదించవచ్చని 'కాట్రిన్‌ మొళి' చిత్ర బృందం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com