మన మద్రాస్ కోసం కార్యక్రమానికి విశేష స్పందన ..
- December 06, 2015
తమిళనాడు వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీతారలు ప్రారంభించిన మన మద్రాస్ కోసం.. కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో అభిమానులు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. కొందరు అక్కడే ఉండి ట్రక్కుల్లో సరుకులు ఎక్కించేందుకు సాయం చేస్తున్నారు. మరి కొంత మంది మరో అడుగు ముందుకేసి చెన్నైలో సాయం అందించేందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని నటుడు నవదీప్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు విజయవాడలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి చెన్నైకి భారత్ మోటార్ పార్సిల్ సర్వీస్ ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తోంది. చెన్నై వరద బాధితులకి ఏదైనా సాయం అందించాలనుకునే వారు ఆ సామగ్రిని జవహర్ ఆటోనగర్‌లోని భారత్ మోటార్ పార్సిల్ సర్వీస్‌లో అందజేయాలని నవదీప్ విజ్ఞప్తి చేశారు.చెన్నై వదర బాధితుల సహాయార్థం నిధులు సేకరించేందుకు తెలుగు సినీ తారలు నడుం బిగించారు. 'మన మద్రాస్ కోసం' అనే ప్రత్యేక నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వారు హైదరాబాద్‌లోని పలు షాపింగ్ మాల్స్‌లో బృందాలుగా తిరిగి నిధుల సేకరించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







