మే 10న నేలటిక్కెట్టు ఆడియో.. చీఫ్ గెస్ట్‌గా పవన్ కల్యాణ్!
- May 07, 2018
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సోగ్గాడే చిన్నినాయనా ఫేం కల్యాణ్ కురసాల దర్శకత్వంలో రజనీ తాళ్లూరి రూపొందిస్తున్న చిత్రం నేలటిక్కెట్టు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ క్రమంలో చిత్ర ఆడియోను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నేలటిక్కెట్టు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పవన్ కల్యాణ్ హాజరుకానున్నడంతో అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లతోపాటు భద్రతా చర్యలు చేపట్టే దిశగా చర్యలు తీసుకొంటున్నారు.
ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్పై రూపొందే నేలటిక్కెట్టు చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, సత్యానంద్ మాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







