సైరాలో మరో బాలీవుడ్ నటుడు!
- May 07, 2018
సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడుతోంది. రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహస్తున్నాడు. ఆగస్టు 16, 2017 బుధవారం ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అన్ని సినీపరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్న ఈ ప్రాజెక్టులో తాజాగా మరో ప్రముఖ నటుడు ఈ జాబితాలో చేరిపోయారు.
రేసుగుర్రం చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన రవి కిషన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించనున్నాడు. ఇదివరకే కొన్ని సీన్స్ కి సంబంధించి షూట్ కూడా పూర్తయినట్లు సమాచారం. దాదాపు పది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి రిమేక్ గా 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో నటించారు. వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.
ఆ తర్వాత చిత్రం కూడా మరో అద్బుతమైన విజయం సాధించాలనే లక్ష్యంతో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కిచ్చా సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతిలు నటించనున్నారు. హీరోయిన్ గా నయనతార కనిపించనుంది.
కొద్దికాలం క్రితమే అమితాబ్ బచ్చన్..ఈ సైరా సెట్స్ లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. సైరా వర్కింగ్ స్టిల్స్ లో చిరు లుక్ యోధుడిలా అద్భుతంగా ఉండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..