రష్యాలో ర్యాలీలపై పోలీసుల అణచివేత చర్యలు
- May 07, 2018
బ్రస్సెల్స్ : రష్యాలో అనధికార ప్రతిపక్ష ర్యాలీపై పోలీసులు హింసకు దిగడాన్ని ఇయు ఒక ప్రకటనలో ఖండించింది. వేయి మందికి పైగా ప్రదర్శనకారులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై రష్యా అధికారులు హింసకు పాల్పడడం చూస్తుంటే మౌలిక భావ వ్యక్తీకరణా స్వేచ్ఛకు ముప్పు వున్నట్లు తేలుతోందని యురోపియన్ యూనియన్ పేర్కొంది. దీనికి ఏడు మాసాలు ముందుగా కెటలోనియాలో శాంతియుతంగా జరిగిన నిరసనలు, ఆందోళనలపై పోలీసులు దారుణంగా వ్యహరించడం, వాటిని అణచివేయడానికి చర్యలు తీసుకున్నపుడు ఇయు భిన్నంగా స్పందించింది. ఆ సమయంలో అధికార యంత్రాంగాన్ని సమర్ధించిన ఇయు ఇప్పుడు పోలీసుల చర్యలను నిరసించింది. అయితే రష్యావ్యాప్తంగా చోటు చేసుకున్న ఈ ప్రదర్శనల్లో పలు నగరాల్లో జరిగిన వాటికి అధికారుల అనుమతి లేదని తెలుస్తోంది. అయినా ప్రదర్శకులపై పోలీసుల దారుణ చర్యలు, పెద్ద సంఖ్యలో ప్రదర్శకులను అరెస్టు చేయడాన్ని ఖండించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..