మలేసియా:92 ఏళ్ల వయస్సులో మళ్లీ ప్రధాని అవుతున్నారు
- May 09, 2018
మలేసియా సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని మహతిర్ మొహమద్ చారిత్రక విజయం సాధించారు.
దేశంలో గత 60 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న బారిసన్ నేషనల్ కూటమి ప్రభుత్వాన్ని 92 ఏళ్ల మహతిర్ ఓడించారు.
రాజకీయాల నుంచి రిటైర్ అయిన మహతిర్.. తన మాజీ సహచరుడు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి నజీబ్ రజాక్‌పై పోటీ చేసేందుకు మళ్లీ బరిలో దిగారు. నజీబ్‌కు రాజకీయ గురువు మహతిర్.
''మేం ప్రతీకారం తీర్చుకోవాలనుకోవటం లేదు. న్యాయాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాం'' అని మహతిర్ విలేకరులతో అన్నారు.
మొత్తం 222 పార్లమెంటు సీట్లకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు అవసరం కాగా.. మహతిర్ నాయకత్వంలోని పకటన్ హరపన్ కూటమి 115 సీట్లలో విజయం సాధించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుత ప్రధాని నజీబ్ రజాక్ నేతృత్వంలోని బీఎన్ కూటమికి 79 సీట్లు దక్కాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..