దంత సమస్యలను దూరం చేసేందుకు 6 చిట్కాలు
- May 09, 2018
కొంత మంది దంత సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. దంతాలు ఆరోగ్యంగా ఉండటానికీ, నోరు తాజాగా అనిపించడానికి అస్తమానం మౌత్ ఫ్రెషనర్లనే వాడాల్సిన అవసరం లేదు. మనం కొన్ని రకాల ఆహారపదార్ధాలను తీసుకోవటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అవి ఏమిటంటే...
1. స్ట్రాబెర్రీ, అనాస: వీటిలో బ్రొమిలీన్, విటమిన్ సి పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను ఎప్పుడు తిన్నా నోరు తాజాగా ఉంటుంది.
2. చీజ్, పనీర్: వీటిలోని క్యాల్షియం, ఫాస్పరస్ నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. నోట్లో తగినంత లాలాజలం ఉన్నప్పుడు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు.
3. నీరు: ఎన్ని తిన్నా నీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే నీరు నోటిలోని యాసిడ్ ఉత్పత్తులను నియంత్రణలో ఉంచుతుంది.
4. యాపిల్: సాయంత్రం పూట ఆకలి వేసినప్పుడు బిస్కెట్లు తినే బదులు ఒక యాపిల్ ను తినాలి. దీనిలోని మాలిక్ యాసిడ్ పళ్లని శుభ్రం చేస్తుంది. నోరు తాజాగా ఉంటుంది.
5. బాదం: బాదంలో దంతాల ఆరోగ్యాన్ని కాపాడే ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయి. ఇవి పళ్లకు ఎంతో మేలు చేస్తాయి.
6. పెరుగు: పెరుగులోని మంచి చేసే బ్యాక్టీరియాలు నోటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







