దుబాయ్‌ మెగా సేల్‌ 90 శాతం డిస్కౌంట్‌

- May 09, 2018 , by Maagulf
దుబాయ్‌ మెగా సేల్‌ 90 శాతం డిస్కౌంట్‌

దుబాయ్‌:మే 10 నుంచి 12 వరకు దుబాయ్‌ సూపర్‌ సేల్‌ వీకెండ్‌ షాపింగ్‌ ప్రియుల్ని అలరించనుంది. 25 శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్స్‌ ఈ సేల్‌ ప్రధాన ఆకర్షణ. 1000 వరకు ఔట్‌లెట్స్‌ ఈ డిస్కౌంట్స్‌ని అందిస్తున్నాయి. సిటీ వ్యాప్తంగా వున్న రిటెయిలర్స్‌, గణనీయంగా ధరల్ని తగ్గించి, పలు బ్రాండెడ్‌ ఐటమ్స్‌ని విక్రయిస్తున్నారు. డిజైనర్‌ దుస్తుల దగ్గర్నుంచి, పిల్లలు ఉపయోగించే టాయ్స్‌ వరకు, హోమ్‌ వేర్‌ నుంచి హార్డ్‌ వేర్‌ వరకూ ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌లో పలు రకాలైన వస్తువులు లభిస్తాయి. లివైస్‌, అర్మానీ మైఖేల్‌ కోర్స్‌, ప్యుమా, అమెరికన్‌ ఈగల్‌, స్ప్లాష్‌ వంటి బ్రాండ్స్‌ ఇక్కడ లభ్యమవుతాయి. మే 10 నుంచి 12 వరకు అంటే మూడు రోజులపాటు ఈ సూపర్‌ సేల్‌ అందుబాటులో ఉంటుంది. బ్యూటీ, ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ అతివల్ని అమితంగా ఆకర్షించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com