అబుదాబి:స్టీల్ స్క్రాప్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం
- May 09, 2018
అబుదాబి:ముసఫా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ స్టీల్ స్క్రాప్ యార్డ్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికుల్ని భయాందోళనలకు గురిచేసింది. అబుదాబీ సివిల్ డిఫెన్స్‌కి చెందిన ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా మంటల్ని అదుపు చేయడంతో, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ మయూఫ్ అల్ కెత్బి మాట్లాడుతూ, ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే సకాలంలో సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్ టీమ్ చేరుకుని, మంటల్ని ఆర్పివేసినట్లు తెలిపారు. సివిల్ డిఫెన్స్ సెంటర్ తరఫున ముసాఫ్ఫా నుంచి ఫైర్ ఫైటర్ టీమ్స్, షక్‌బూత్ సిటీ నుంచి ఓ టీమ్, ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ఆఫ్ ముదినాత్ మొహమ్మద్ బిన్ జాయెద్, పోలీస్ ఎట్రోల్స్, అంబులెన్స్ సంఘటనా స్థలానికి వెళ్ళాయి. మంటల్ని ఆర్పివేసి, వెంటనే కూలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. విచారణ కొనసాగుతున్నట్లు బ్రిగేడియర్ అల్ కెత్బి చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..