తెలంగాణా ఉద్యోగులకు కె.సి.ఆర్ స్వీట్ న్యూస్!!

- May 09, 2018 , by Maagulf
తెలంగాణా ఉద్యోగులకు కె.సి.ఆర్ స్వీట్ న్యూస్!!

తెలంగాణా:ఈ నెల 14న జరగబోయే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేయనున్నారు. ఆ రోజున వేతన సవరణ సంఘం ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మొత్తం 18 డిమాండ్లపై చర్చలు జరపనున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తనున్న 36 డిమాండ్లపై కూడా కేసీఆర్ స్పందించనున్నారని సమాచారం. ఇందులో ముఖ్యంగా పదవీ విరమణ వయసు పెంపు, బదిలీలు, పెన్షన్ స్కీం వంటి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలనిస్తాయని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com