దుబాయ్ వెళ్లినరోజే అదృశ్యం...
- May 11, 2018
తెలంగాణ:యు.ఏ.ఈ దేశంపోయి బాగా సంపదించుకోని వచ్చి భార్యపిల్లలతో ఆనందంగా గుడుపుదామని తెలిసిన వాళ్ల దగ్గర అ ప్పు చేసి మరీ దుబాయ్‌కి వెళ్లిన 24గంటల్లోపే అదృశ్యమయ్యాడు కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన మంగళి యాదగిరి. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన మంగళి యాదగిరి జూలై 18-2015న దుబాయ్‌కి కంపెనీ వీసాపై వెళ్లాడు. అక్కడి దుబాయ్ విమానాశ్రయంలో దిగగానే సోనాపూర్ ఏరియాలో అక్కడి ఏజెంట్ రూంకు తీసుకెళ్లాడని, రూంకు వెళ్లగానే తన కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి' నేను బాగానే ఉన్న విమానాశ్రయం నుండి సోనాపూర్ ఏరియా లోని రూంకు ఏజెంట్ తీసుకొచ్చాడని మీరు నా గురించి దిగులు పడ్డొద్దు అంటు యాదగిరి కు టుంబసభ్యులతో మాట్లాడాడు' అక్కడి వరకు బాగానే ఉన్న దుబాయ్‌కి వెళ్లి రూంలోకి వెళ్లిన తర్వాత మాట్లాడిన మాటనే చివరివి. అప్పటి నుండి ఇప్పటివరకు యాదగిరి ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియదు. ఏజెంట్లకు అడిగితే రూంలో నుండి ఎక్కడికి వెళ్లాడో తెలియదు అం టు సమాధానం చెబుతున్నారని కుటుంబస భ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మూడు సంవత్సరాలు గడుస్తున్న అసలు యా దగిరి ఏం చేస్తున్నాడో ఏమయ్యాడో ఇప్పటికీ సమాచారం లేదు.
యాదగిరి కోసం తన అన్న నర్సింలు ఏజెంట్లు, మంత్రుల వద్దకు తిరిగిన సరైనా స్పందన లేదని దీంతో సొంతఖర్చులతో తానే దుబాయ్‌లోని అ న్ని జైళ్లు, దుబాయ్‌లో తెలుగువారి వద్ద వెతికి నా యాదగిరి ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి ఎక్కడ తిరిగిన ఫలితం లేదని ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ, గల్ఫ్‌లోని తెలుగువాళ్లు గానీ యా దగిరి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలని కు టుంబసభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.
నాభర్త ఆచూకీ తెలపండి..
నా భర్త యాదగిరి 2015 జూలై నెలలో దుబాయ్‌కి కంపెనీ వీసాపై వెళ్లాడు.దుబాయ్ విమానాశ్రయంలో దిగగానే సోనాపూర్ ఏరియాలో అక్కడి ఏజెంట్ రూంకు తీసుకెళ్లాడని చెప్పి మాట్లాడిన మాటలే చివరివి. అప్పటినుండి ఇప్పటివరకు నా భర్తనాతో కానీ మా కుటుంబసభ్యులతో కానీ మాట్లాడలేదు. ఏజెంట్ల దగ్గరికి తిరిగి న, నాయకుల వద్దకు తిరిగిన స్పందించడం లేదు. నేను బీడీలు చేస్తూ ఉన్న ఒక్క గానొక కొడుకును చదివిస్తూ బ్రతుకుతున్నానని, ఎప్పటికైనా నాభర్త జాడ తెలుస్తుం దన్న ఆశ ఉంది.నా కొడుకు బాధ, నాన్న బాధ చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అక్కడి అధికారులతో చర్చించి నా భర్త జాడకోసం చర్యలు తీసుకోవాలి.
-భాగ్యలక్ష్మీ,యాదగిరిభార్య
యాదగిరి కోసం వెతుకుతున్నాం..
యాదగిరి విషయం మాకు తెలియగానే అతని ఆచూకీ కోసం తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభించాం. అసలు యాదగిరి ఎమయ్యాడు.. ఎక్కడున్నడు.. అనే విషయంపై అక్కడి అధికారులతో మాట్లాతూ ప్రయత్నాలు ముమ్మరం చేశాం. యాదగిరి గురించి తెలియదంటున్న ఇక్కడి, గల్ఫ్ ఏజెంట్లపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి విన్నవించాం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఎప్పటికైనా యాదగిరి ఆచూకీ లభిస్తుందన్న ఆశ ఉంది.
-బసంత్‌రెడ్డి, తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







