ఫేక్ జాబ్స్: ఎమిరేట్స్ గ్రూప్ హెచ్చరిక
- May 14, 2018
ఎమిరేట్స్ గ్రూప్ నుంచి ఉద్యోగావకాశాల పేరుతో ఆఫర్ లెటర్ వస్తే అప్రమత్తంగా వుండాల్సిందే. ఈ విషయాన్ని ఎమిరేట్స్ గ్రూప్ తమ అధికారిక వెబ్సైట్లో ఓ నోటిఫికేషన్ వార్నింగ్‌ని పొందుపర్చింది. తమ గ్రూపుతో సంబంధం లేకుండా కొందరు అక్రమార్కులు నిరుద్యోగుల్ని ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, ఈ నేపథ్యంలోనే ఉద్యోగార్థుల్ని అప్రమత్తం చేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది ఎమిరేట్స్ గ్రూప్. ఉద్యోగాల కోసం డబ్బులను జమచేయాల్సిందిగా అక్రమార్కులు నిరుద్యోగులను కోరుతున్నారు. ఉద్యోగం కోసం ఎమిరేట్స్ గ్రూప్ ఇలాంటి చర్యలకు పాల్పడదని సంస్థ స్పష్టం చేసింది. మెయిల్ ఐడీని గుర్తించడం ద్వారా 'ఫేక్' అని తెలుసుకోవచ్చంటోంది ఎమిరేట్స్ గ్రూప్.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







