ట్రక్‌ డ్రైవర్స్‌కి పోలీస్‌ అడ్వయిజరీ

- May 14, 2018 , by Maagulf
ట్రక్‌ డ్రైవర్స్‌కి పోలీస్‌ అడ్వయిజరీ

మస్కట్‌: మస్కట్‌లో ట్రక్‌ డ్రైవర్లకు రాయల్‌ ఒమన్‌ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. కేవలం నాలుగున్నర గంటలు మాత్రమే రోడ్డుపై వుండాల్సిందిగా ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 10 టన్నులకు పైగా బరువున్న వాహనాల్ని ఆదివారం నుంచి గురువారం వరకు మాత్రమే సిటీ రోడ్స్‌పైకి అనుమతిస్తారు. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 6 గంటల నుండి 9.30 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా ఈ మార్పుల్ని గుర్తించాల్సి వుంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com