రమదాన్‌: మవసలాత్‌ టిక్కెట్‌ దరల తగ్గింపు

- May 14, 2018 , by Maagulf
రమదాన్‌: మవసలాత్‌ టిక్కెట్‌ దరల తగ్గింపు

మస్కట్‌: ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ మవసలాత్‌, పవిత్ర రమదాన్‌ మాసం సంద్భంగా టిక్కెట్‌ ధరల్ని తగ్గించింది. ఈ తగ్గింపు 20 శాతం వరకూ వుంది. క్యాపిటల్‌ పరిధిలోని టిక్కెట్‌ ధరలపై మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మస్కట్‌ వెలుపల మాత్రమే ఈ తగ్గింపు ధరలు అమల్లో వుంటాయి. మస్కట్‌ పరిధిలో ఉదయం 6.30 నిమిషాల నుంచి అర్థరాత్రి వరకు ప్రతి 15 నుంచి 20 నిమిషాల వరకు బస్‌ సర్వీసులు అందుబాటులో వుంటాయి. షిప్పింగ్‌ సర్వీసులకు సైతం ఈ 20 శాతం డిస్కౌంట్‌ వర్తిస్తుందని మవసలాత్‌ పేర్కొంది. రమదాన్‌ నేపథ్యంలో వర్కింగ్‌ అవర్స్‌ మారిన దరిమిలా మస్కట్‌ - బార్కా, మస్కట్‌ - సమైల్‌, మస్కట్‌ - రుస్తాక్‌లలో ట్రిప్స్‌ సంఖ్యను మార్చగా, మిగతా రూట్లలో ఎలాంటి మార్పూ లేదని మవసలాత్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com