చరిత్రలో తొలిసారి: ప్రపంచమంతా ఒకేరోజు రంజాన్ మాసం ప్రారంభం

- May 16, 2018 , by Maagulf
చరిత్రలో తొలిసారి: ప్రపంచమంతా ఒకేరోజు రంజాన్ మాసం ప్రారంభం

ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో గురువారం నుంచి రంజాన్‌ ఉపవాసదీక్షలు ప్రారంభించాలని మతపెద్దలు ప్రకటించారు. కాగా చరిత్రలో తొలిసారి ప్రపంచమంతా ఒకేరోజు రంజాన్ మాసం ప్రారంభం అవుతోంది. అంతకుముందు దుబాయ్ సహా ఇతర ప్రాంతాల్లో మనకంటే ఒకరోజు ముందు దీక్షలు, పండుగలు జరిగేవి.

బుధవారం రాత్రి ఆకాశంలో రంజాన్‌ మాసం చంద్రవంక కన్పించిందని చార్మినార్‌ పరిసర మసీదుల నుంచి రంజాన్‌ మాసం సైరన్‌ మోతలు విన్పించాయి. రూహిత్‌ ఇలాల్‌ కమిటీ ప్రతినిధులు సైతం రాత్రి ఆకాశంలో రంజాన్‌ మాసం చంద్రవంక కన్పించిందని సమాచారం ఇవ్వడంతో మసీదులలో రాత్రి తొమ్మిది గంటలకు పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభ సూచకంగా తరావి నమాజ్‌ నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. రంజాన్‌ ఉపవాస దీక్షలు తెల్లవారు జామున సహర్‌తో ప్రారంభమై ఇఫ్తారుతో ముగుస్తాయి .

హలీం రెడీ

రంజాన్‌ మాసం ప్రారంభ సన్నాహాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో హరీస్‌ బట్టీలు సిద్ధమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో హలీం రెడీగా అందుబాటులో ఉండటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంజాన్‌ మాసంలో ఇఫ్తార్ తర్వాత హలీంను ఆరగించడం కూడా ఓ సంప్రదాయంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com