సినిమా రచయిత సూసైడ్ అటెంప్ట్‌పై క్లారిటీ..
- May 18, 2018
ప్రముఖ రచయిత, దర్శకుడు రాజసింహం ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు డైలాగులు రాశాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమాతో దర్శకుడిగా మారారు. రాజసింహా ఆశించిన స్థాయిలో ఈ మూవీ విజయం సాధించింలేకపోవడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయని.. దీంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లినట్టు వదంతలు వినిపించాయి. ఈయనకు ఇప్పుడు సినిమాలో ఆవకాశాలు లేని కారణంగా తన నివాసంలో నిద్రమాత్రలు మింగారని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాజసింహా క్లారిటీ ఇచ్చారు. తనకు మధుమేహం ఉండటం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోయాయి అని తెలిపారు. దీంతో ఆయనకు ఆయాసం వచ్చి పడిపోయారట. కొద్దిసేపటి తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారట. ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉందని.. మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చి అన్ని విషయాలు చెబుతానని రాజసింహా తెలిపారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







