మక్కాలో డ్రోన్ల ద్వారా రమదాన్ క్రౌడ్ నియంత్రణ
- May 18, 2018
మక్కా: మక్కాలోని గ్రాండ్ మాస్క్‌లో క్రౌడ్‌ని మ్యానేజ్ చేసేందుకు తొలిసారిగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. మేజర్ జనరల్ మొహమ్మద్ అల్ అహ్మదీ (డిప్యూటీ కమాండర్ ఆఫ్ ఉమ్రా ఫోర్సెస్) ఈ విషయాన్ని వెల్లడించారు. సెక్యూరిటీ, ఆర్గనైజేషనల్, హ్యుమానిటేరియన్ యాస్పెక్ట్స్‌లో ఉమ్రా క్రౌడ్ మ్యానేజ్‌మెంట్ ప్లాన్‌ని రూపొందించినట్లు అల్ అహ్మది చెప్పారు. డిస్ట్రెస్‌తో ఎవరైనా బాధపడుతున్నట్లు గుర్తిస్తే వారిని గ్రాండ్ మాస్క్‌లోకి వెళ్ళనీయబోమనీ, ఇది వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న నిర్ణయంగానే భావించాలనీ, అది ఇతరుల భద్రత కోణంలోనూ మేలు చేస్తుందని ఆయన వివరించారు. లగేజ్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ హరామ్ ప్లాజాల్లోకి రానివ్వబోమని అల్ అహ్మదీ స్పష్టం చేశారు. డ్రోన్లు, సెక్యూరిటీ ఎయిర్‌క్రాఫ్ట్‌తోపాటు 2,500 కెమెరాలు క్రౌడ్ మూమెంట్‌ని పర్యవేక్షిస్తాయి. 2,400 మంది పోలీసులు, 1,300 సెక్యూరిటీ పెట్రోల్స్ నిరంతరం పనిచేస్తాయి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







