హైదరాబాద్:మే 21న రష్యన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌

- May 18, 2018 , by Maagulf
హైదరాబాద్:మే 21న రష్యన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌

హైదరాబాద్‌, కార్వాన్‌, న్యూస్‌టుడే: రష్యాలో మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ విద్య అభ్యసించేందుకు 600 మంది భారతీయ విద్యార్థులకు అవకాశం కలిపిస్తామని దక్షిణ భారత రష్యన్‌ ఫెడరేషన్‌ కాన్సులేట్‌లో వైస్‌-కౌన్సిలర్‌(కల్చర్‌) మైఖల్‌ జే గోర్బతోవ్‌ తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రష్యాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల వల్ల రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడతాయన్నారు. నాణ్యమైన, అధిక రాయితీలతో ఇంజినీరింగ్‌, మెడికల్‌ విద్యను అందించే రష్యన్‌ విద్యాసంస్థలతో ఈ నెల 21న హైదరాబాద్‌లో ‘రష్యన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌’ నిర్వహించనున్నట్లు స్టడీ అబ్రాడ్‌ చెన్నై సంస్థ ఎండీ రవిచంద్రన్‌ తెలిపారు. మ్యారీగోల్డ్‌ హోటల్‌లో రష్యన్‌ సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కల్చర్‌- చెన్నై, స్టడీ అబ్రాడ్‌ సంయుక్తంగా నిర్వహించే ఫెయిర్‌లో 14 రష్యన్‌ ప్రభుత్వ విద్యాసంస్థలు పాల్గొంటాయని, బ్యాచ్‌లర్స్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీల్లో అర్హులైన వారికి  ప్రవేశాలు ఇస్తామన్నారు.  నీట్‌ రాసిన వారే రష్యాలో మెడిసిన్‌ చేయడానికి అర్హులన్నారు. ఎంపికైన వారు నాలుగేళ్లు ఇంజినీరింగ్‌, ఆరు సంవత్సరాల మెడిసిన్‌ కోర్సులు చేయాల్సి ఉంటుంది. మెడిసిన్‌ పూర్తయ్యాక భారత వైద్య మండలి నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సంవత్సరం పాటు ఇక్కడి ఆసుపత్రుల్లో పని చేసిన వారికి శాశ్వత గుర్తింపు లభిస్తుందని వివరించారు. ఉపకార వేతనంపై నాణ్యమైన విద్యనభ్యసించాలనుకునేవారు రష్యన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com