బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి .!
- May 19, 2018
4 రోజుల్లో అనేక మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయాలు చివరకు ఓ కొలిక్కి వచ్చాయి. సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయగానే కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. వెంటనే జేడీఎస్ నేత కుమారస్వామి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు తెలిపారు. వెంటనే గవర్నర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ఆహ్వానించారు. దీంతో సోమవారం తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కుమార స్వామి ప్రకటించారు. పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నట్లు కుమారస్వామి మీడియాతో తెలిపారు. కాని.. తాజాగా ప్రమాణ స్వీకారాన్ని సోమవారం కాకుండా బుధవారానికి అంటే మే 23 కు వాయిదా వేస్తున్నట్లు జేడీఎస్ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 12.30కు కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీఎస్ తెలిపింది. సోమవారం(మే 21)న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి కాబట్టి ఆ రోజును మార్చినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







