సింగపూర్ లో అన్నమయ్య జయంతి ఉత్సవాలు
- May 20, 2018
సింగపూర్:సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యం లో "తొలి తెలుగు పద కవితా పితామహుడు" శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు స్థానిక శారదా హాల్, రామకృష్ణ మిషన్ నందు ఘనంగా జరిగాయి. సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడిన ఈ ఉత్సవంలో సింగపూర్ లో నివసిస్తున్న వందలాది ప్రవాస తెలుగువారు పాల్గొని,సామూహికంగా సప్తగిరి సంకీర్తనలను ఆలపించారు .అన్నమయ్య సంకీర్తనలకు సంభందించి విశేష కృషిచేసిన 'పద్మశ్రీ' డా. శోభారాజు గారు ముఖ్య అతిధి గా విచ్చేసి, అన్నమయ్య మరియు ఆయన సంకీర్తనల గురించి ఉపన్యసించి, కొన్ని సంకీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా శోభారాజు గారు మాట్లాడుతూ, ఈ విధంగా అన్నమయ్య జయంతి సింగపూర్ లో తొలిసారిగా జరగడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, తెలుగు సంస్కృతి ,సాంప్రదాయాల పై సింగపూర్ తెలుగు సమాజము నకు ఉన్న భక్తి, శ్రద్ద ల వలనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రశంసించారు. ప్రత్యేక అతిధి గా రామకృష్ణ మిషన్ అధ్యక్షులు స్వామి విమోక్షానంద విచ్చేసి తమ సందేశాన్నందంచారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పైమూడుకోట్ల దేవతలకు ఆలవాలమైన గోవు మరియు గోపంచగవ్య మహాశక్తి యొక్క విశిష్ఠత గురించి శ్రీ వడ్డి కృషి గారు వివరించారు. కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ జరుపబడింది.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ వినోదభరితం మరియు మనోరంజకమైన కార్యక్రమాలే కాకుండా, ఆ భగవంతుని మీద పూర్తి భక్తి శ్రద్ధలతో భక్తి ప్రధానమైన ఉగాది పూజ వంటి కార్యక్రమాలు చేసామని , ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి, ఆ భగవన్నామస్మరణకి తన జీవితం అంకితం చేసి, తనదైన శైలి లో ఆ శ్రీనివాసుని సంకీర్తనలను రచించి ఆలపించిన మన తెలుగు కవి అన్నమయ్య జన్మదిన మహోత్సవం జరుపుకోవడం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారికి, వాయుద్య మరియు గాత్రసహకారమందించిన ప్రతి ఒక్కరికీ ప్రాంతీయ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలను తెలిపారు. ఈకార్యక్రమం విజయవంతము కావడానికి శ్రమ్రించిన కార్యవర్గసభ్యులు ప్రదీప్, సుందర్, జ్యోతీశ్వర్, మల్లిక్, ప్రసాద్ లకు మరియు దాతలకు కార్యదర్శి సత్య చిర్ల దన్యవాదాలు తెలిపారు.




తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







