చంద్రబాబుకు కుమారస్వామి ఫోన్!
- May 20, 2018
ఏపీ సీఎం చంద్రబాబుకు కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి ఫోన్ చేశారు.. ప్రమాణస్వీకారానికి రావలసిందిగా చంద్రబాబును కుమారస్వామి ఆహ్వానించారు.. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా వద్దా అన్న డైలామాపై టీడీపీలో క్లారిటీ వచ్చేసింది... దీనిపై మంత్రులతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు చర్చించారు... మెజారిటీ మంత్రులు ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని సూచించారు.. దీంతో బుధవారం జరిగే ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశముంది. దేవగౌడతో ఉన్న సాన్నిహిత్యం... ప్రమాణ స్వీకారానికి వెళ్తేనే దేశానికి సరైన సంకేతం వెళ్తుందన్న మంత్రుల వాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు... పైగా కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని మంత్రులు గుర్తు చేశారు... గతంలో గుంటూరు రైతు కోసం సభకు దేవగౌడ్ వచ్చారని... జేడీఎస్‌తో టీడీపీకి మంచి సంబంధాలే ఉన్నాయని మంత్రులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







