'సత్యం రాజేష్' త్వరలోనే హీరోగా..
- December 07, 2015
హాస్యనటులుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తరువాత హీరోగా మారిన వారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే ఇలా హీరోగా మారిన నటులు సక్సెస్ అయిన దాఖలాలు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు ఇదే బాటలో మరో హాస్య నటుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సత్యం సినిమాతో కమెడియన్ గా అందరి దృష్టిని ఆకర్షించి, ఆ తరువాత కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న 'సత్యం రాజేష్' త్వరలోనే హీరోగా అలరించనున్నాడు. త్రిష లీడ్ రోల్ లో నటిస్తున్న లేడి ఓరియంటెడ్ సినిమా నాయకీ సినిమా ద్వారా రాజేష్ హీరోగా మారుతున్నాడు. అయితే ఈ సినిమాలో రాజేష్, త్రిషకు జంటగా నటించడంలేదు. రెండు జంటల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేష్ కు జోడిగా సుష్మారాజ్ నటించనుంది. త్రిష జోడిగా డమరుకం ఫేం వెంకట్రామన్ కనిపించనున్నాడు. 1980లలో జరిగే కథగా తెరకెక్కనున్న ఈ సినిమాను హార్రర్ జానర్ లో రూపొందిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు గోవర్థన్ రెడ్డి దర్శకుడు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







