రూమర్స్‌ని ప్రచారం చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

- December 07, 2015 , by Maagulf
రూమర్స్‌ని ప్రచారం చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

 


క్యాబినెట్‌ మార్పుల గురించి రూమర్స్‌ని ప్రచారం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోషల్‌ మీడియా,మొబైల్‌ ఫోన్‌ యాప్స్ ద్వారా ఈ రూమర్స్‌ని ఆ వ్యక్తి ప్రచారం చేస్తున్నట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. చట్టాల ప్రకారం అధికారిక సమాచారం లేకుండా దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి. మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా, మొబైల్‌ యాప్స్‌ ఇలా ఏ మాధ్యమం ద్వారా అయినా ప్రభుత్వ విధానపర నిర్ణయాలపై రూమర్స్‌ ప్రచారం చేయడం చట్ట ప్రకారం శిక్షించదగ్గ నేరాలుగా పరిగణిస్తారు. వ్యక్తులు, సంస్థలు తప్పుడు ప్రచారం చేయడం ద్వారా సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com